సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ వ్యవసాయ శాఖ కార్యాలయంలోడిజిటల్ యాప్ మరియు డిజిటల్ లైబ్రరీ ,డిజిటల్ వ్యవసాయ కోర్సులను క్యాబి బయో ప్రొటెక్షన్ పోర్టల్ మరియు ప్లాంట్ వైస్ ప్లస్నాలెడ్జ్ బ్యాంక్, క్రాప్ స్ప్రేయర్ వంటి యాప్ లు సంబంధించిన పోస్టర్లను జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితుల్లో వ్యవసాయంలో ఆధునికత సాంకేతికత అందిపుచ్చుకున్నప్పుడే వ్యవసాయ రంగంలో అధిక లాభాలు సాధించవచ్చని ఆధునిక సాంకేతిక వల్ల రైతు యొక్క శ్రమ సమయం ఆదావుతుందని తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడిన సాధిస్తూ ఎక్కువ ఆదాయం పొందుతూ రైతు యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలన్నారు.
అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ యాప్ మరియు డిజిటల్ లైబ్రరీ డిజిటల్ వ్యవసాయ కోర్సులను క్యాబి బయో ప్రొటెక్షన్ పోర్టల్ మరియు ప్లాంట్ వైస్ ప్లస్ నాలెడ్జ్ బ్యాంక్ క్రాప్ స్ప్రేయర్ వంటి యాప్ లు వ్యవసాయ రంగంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా యువ రైతులు విద్యావంతులైన రైతులు ఉపయోగించుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఎంతో అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. అదేవిధంగా తెలియని మిగతా రైతులకు తెలియ చెప్పవచ్చని ప్రస్తుతం ప్రతి రైతు దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ద్వారా డిజిటల్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకొని వాడుకున్నట్లయితే రోజువారి వ్యవసాయ కార్యక్రమాలలో నూతన వ్యవసాయ పరిజ్ఞానంతో చీడపీడలను అరికట్టవచ్చు అని రసాయన పురుగుమందులకు బదులుగా సేంద్రీయ పద్ధతులను నేర్చుకోవచ్చని పంటల పిచికారిలో ఎంత మోతాదులో పురుగుమందును వాడాలో తెలుసుకోవచ్చని అన్నారు.
పంట వివిధ దశల్లో వచ్చేటువంటి చీడపీడలను మొబైల్ ఫోన్ ద్వారా గమనించి వాటి నివారణ పద్ధతులను సులువుగా తెలుసుకోవచ్చని అన్నారు.
ఈ డిజిటల్ యాప్స్ వాడడం వల్ల రైతుల యొక్క సమయం ఆదావుతుందని తన పొలం నుండే తన పొలంలో మరియు పంటలలో సోకేటువంటి చీడపీడల గూర్చి పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.
ఈ డిజిటల్ యాప్స్ అన్ని వ్యవసాయ విస్తరణ విభాగంలో పనిచేసే అధికారులకు యువ రైతులకు విద్యావంతులైన రైతులకు ఎంతో ఉప యుక్తంగా ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు రాజ్ నారాయణ సోమలింగారెడ్డి హర్ష తో పాటుగా దేశి కోఆర్డినేటర్ అమరేష్ కుమార్ మరియు సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్ దక్షిణాసియా కోఆర్డినేటర్ మధు మంజరి పాల్గొన్నారు.