సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
తేది -10-09-2024.
మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని సిఎంఆర్ బియ్యం డెలివరీ ఆలస్యంచేస్తున్న మిల్లర్లతో జిల్లా అదనపు కలెక్టర్ మెదక్ వెంకటేశ్వర్లు సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎంఆర్ బియ్యం డెలివరీలో ఆలస్యం చేస్తున్న మిల్లర్లకు సిఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలన్నారు.
జిల్లాలోని మిల్లులకు వానాకాలం ధాన్యం 2,68,777 టన్నులు కేటాయించటం జరిగింది అని ఇందుకు గాను మిల్లరూ అందజేయాల్సిన 1,80,741 టన్నుల బియ్యంకు గాను ఇప్పటివరకు 1,46,858 టన్నుల బియ్యం 81.30% పూర్తి అయ్యిందని ఇంకనూ పూర్తి చేయాల్సిన 33,883 టన్నులను ఈ నెల ఆఖరు వరకు మాత్రమే గడువు ఉన్నందున త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
యాసంగి సీజన్ 2023-24 కి గాను 2,52,013 టన్నుల ధాన్యం కేటాయించటం జరిగింది అని ఇందుకుగాను 1,70,777 టన్నుల బియ్యం రావాల్సిఉందని ఇందుకు గాను 54961 టన్నుల బియ్యం డెలివేరి చేశారని 32.18% మాత్రమే పూర్తి అయ్యిందని మిగితాబియ్యం 1,15,816 టన్నులు గడువులో రికవరీ చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాధికారిని ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లాపౌర సరఫరాల అధికారి సురేశ్ రెడ్డి జిల్లామేనేజర్ హరికృష్ణ జిల్లారామిల్లర్స్ అధ్యక్షులు వీరేశం మరియు మిల్లర్లూ పాల్గొన్నారు.