రానున్న 72 గంటలలో భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి… జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.

తేది -31-08-2024.

మెడికల్ అధికారులతో ఎంపీడీవోలతో అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణ.
సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న కారణంగా ప్రజలందరూ పరిసరాల వ్యక్తిగత శారీరక పరిశుభ్రతపై దృష్టి సారించాలి
దోమల నివారణకు ప్రతిరోజు శానిటేషన్ ఫాగింగ్ తప్పకుండా చేపట్టాలి.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
నీటిని నిల్వ ఉంచకూడదు.
మందుల కొరత రానీయొద్దు.
శనివారం స్థానిక కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని కోల్చారం మండలకేంద్రంలో లోని పరిసరాలను శనివారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రోగుల తో మాట్లాడారు
మెడికల్ స్టోర్ రూమును పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రానున్న 72 గంటలలో భారీ వర్షం ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు. మందుల కొరతలేకుండా చూడాలన్నారు.అంటూ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని వైరల్ ఫీవర్ డెంగు మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గుంతలలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని ఆయన అన్నారు.నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్ క్రూడ్ ఆయిల్ ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన చెప్పారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియాచికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగాఉండాలన్నారు.ఇండ్లల్లో నీటి నిలువలు లేకుండా పరిశుభ్రంగాఉంచుకోవలాన్నారు.
ఇంటి పరిసరాలలో పాత టైర్లు కొబ్బరి చిప్పలు పగిలిన సీసాలు ప్లాస్టిక్ కవర్లు వాడిన టీ కప్పులు ఇతర నీటి నిలువలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.
వారానికి ఒక సారి నీటి పాత్రలను శుభ్రపరచి నీటిని నింపుకోవాలనీ ఇండ్ల లో వాడే కూలర్స్ ఫ్రీజ్ ఏసీ లలో నీరు నిల్వ లేకుండా ఎపటికప్పుడు శుభ్రపరచుకొని జాగ్రత్త పడాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో లార్వాను గుర్తించి ఇలాంటి వాటివల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని ఇలాంటి వాటిని నిర్మూలించాలని అధికారులకు సూచించారు.జిల్లాలో సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని పాడుబడిన బావులను కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని మలేరియా డెంగీ టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు.
వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని కాచి చల్లార్చిన నీటి మాత్రమే తాగాలని తెలిపారు. అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు.నిలువ చేసిన పదార్థాలు బయట తిను బండాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్నిరక్షించుకోవాలన్నారు.
ఈకార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!