భారి వర్ష సూచన నేపథ్యంలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
9391942254 కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు
మండల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి.
వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన మేరకు రాబోయే మూడు రోజుల పాటు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక నేపథ్యంలో జిల్లాకి రెడ్ అలెర్ట్ ప్రకటించడం జరిగిందన్నారు.గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికారులు పనిచేసే చోట కార్య స్థానాల్లో అందుబాటులో ఉండాలని అన్నారు.మండల జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని అత్యవసర సేవలకు స్పందించి ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వర్షాలు, వరదలు సంభవించినప్పుడు
లో లెవల్ కల్వర్టులు నీరు చేరిన రహదారులు
దాటకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయితీ కార్యదర్శులు గ్రామ స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని తెలిపారు.పశువులను మేతకు బయటకు వదల కుండా ఇంటిపట్టునేఉంచాలని వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వ్యవసాయ పనులకు వెళ్ళొద్దని అన్నారు.
జిల్లాలో మండలాలు లోతట్టు ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.
రాబోయే రెండు మూడు రోజులు చాలా కీలకమని అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
శిధిలావస్థకు చేరుకున్న ఇళ్లను గుర్తించి ప్రజలు నివాసం ఉండకుండా తరలింపు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామ స్థాయిలో పంచాయితీ కార్యదర్శులు అప్రమత్తంగా అంటూ ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందించాలని తెలిపారు.
జిల్లా మండల స్థాయిలో అత్యవసర సమయాలలో వినియోగించుకునే విధంగా గజఈత గాళ్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. జిల్లా స్థాయిలో 9391942254
24 గంటలు పనిచేయు విధముగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఏదేని అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లకు కాల్ చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ డిపిఓ యాదయ్య, ముఖ్య ప్రణాళిక అధికారి జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ అన్ని మండలాల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.