రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 30:- నేత్రదానం చేసి మరో ఇద్దరి అందులకు వెలుగును ప్రసాదించండి.సహజంగా మరణించిన ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేసి మరలా జీవించవచ్చని లయన్స్ అంతర్జాతీయ సమస్థ జిల్లా 320-డి జిల్లా కార్యదర్శి,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి అన్నారు.గత రెండున్నర దశాబ్దాలుగా లయన్స్ క్లబ్ ద్వారా రక్తదాన అవయవ దానాలకు రూపొందించిన కరపత్రాల ద్వారా గోడపత్రికల ద్వారా విద్యార్థి, విద్యార్థులకు,యువతకు అవగాహన సెమినార్లను నిర్వహిస్తూ మారుమూల గ్రామాలలో సైతం అవగాహనకు విస్తృతంగా కృషి చేస్తున్నామన్నారు.నేత్రదానంపై ప్రజలు అపోహలు వీడి కుటుంబంలో ఎవరైనా సహజ మరణం పొందగానే నేత్రదానానికి ముందుకు రావాలని దానివల్ల ఇద్దరి అందులకు చూపును ప్రసాదించవచ్చని తెలిపారు.ఈ పక్షోత్సవాల్లో భాగంగా యువతకు, ఎన్ సి.సి,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి తాను రూపొందించిన గోడపత్రికలను, సమాచార కరపత్రాలను అందజేసి వారిని అవయవదానానికి,నేత్రదానానికి ప్రచార కార్యక్రమాలు చేయవలసిందిగా కోరారు.
కార్నియా అందత్వం అనగా కంటిలోని నల్ల గుడ్డు ముందు భాగాన్ని కప్పి ఉండే పారదర్శకమైన పొరను కార్నియా అంటారు. గాయాలు ఇన్ఫెక్షన్ పోషకాహార లోపంతో కార్నియా దెబ్బతిని చూపు మందగించిన,కోల్పోయిన దానిని కార్నియా అందత్వం అంటారు.నేత్రదానమును ఎవరు చేయవచ్చును.ఆరోగ్యవంతమైన సహజంగా ఎవరైనా మరణించిన తర్వాత ఆరు గంటల లోపు నేత్రదానమును చేయవచ్చన్నారు. కళ్ళజోడు,క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చని పేర్కొన్నారు.నేత్రదానము చేసేవారు బ్రతికున్న కాలంలో నేత్రదాన ప్రతిజ్ఞ పత్రం పూర్తి చేయవలసి ఉంటుంది. లేదా కుటుంబ సభ్యుల అంగీకారంతో కూడా నేత్రాలను దానం చేయవచ్చును నేత్రాలను దానం చేయాలనుకున్న కుటుంబ సభ్యులు లయన్స్, రెడ్ క్రాస్ సంస్థల ప్రతినిధులను సంప్రదించి ఐ-బ్యాంకు సిబ్బంది సహకారంతో 6 గంటల్లోపు నేత్రాలను దానము చేయగా అవసరం ఉన్నవారికి ఐ – బ్యాంకు వారు ఆరు గంటల లోపు ఇతరులకు అమర్చి వారి జీవితాలను వెలుగును ప్రసాదిస్తార ని తెలిపారు.గత రెండున్నర దశాబ్దాలుగా నేత్రదానంపై అవగాహన కల్పిస్తున్న రాజశేఖర్ రెడ్డి తన తండ్రి కీర్తిశేషులు ఏలేటి రాజారెడ్డి మరణానంతరం నేత్రాలను లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేర్చి మరో ఇద్దరి అంధుల జీవితాలలో వెలుగును నింపడం జరిగిందన్నారు.ఇప్పటి వరకు 21 జతల నేత్రాలను సేకరించి హైదరాబాదులోని సరోజినీ దేవి,వాసన్,ఎల్వి ప్రసాద్ నేత్ర నిధి కేంద్రాలకు పంపినట్లు తెలిపారు.నేడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్బుల,రెడ్ క్రాస్ ద్వారా అవగాహన కల్పించి ప్రజలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు తద్వారా ప్రతి సంవత్సరం జిల్లా 320-డి లోని లైన్స్ క్లబ్బుల ప్రతినిధులు నేత్రాలను సేకరించి నేత్రనిధి కేంద్రాలకు పంపడం వల్ల ఎందరికో చూపును ప్రసాదించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్త అవయవ దానాలపై యువత అవగాహన పెంపొందించుకొని,తమ,తమ ప్రాంతాలలో ఎవరు మరణించిన వారి కుటుంబీకులను ప్రోత్సహించి రక్త, అవయవాదానాలకు కృషిచేయాలని రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అవయవ దానం మన జీవితంలో ఒక సాంప్రదాయం కావాలని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని దానివల్ల అపాయకర స్థితిలో నేత్రాలను కోల్పోయిన వారు నేత్రాలు లభించడం వల్ల మరో క్రొత్త జన్మను పొందుతారని మరణించిన వారు కూడా పునర్జన్మను పొందుతారని తెలిపారు.గత రెండున్నర దశాబ్దాలుగా రక్త,అవయవ దానాలపై పూర్తి సమాచారాన్ని తెలిపే కరపత్రాలను,గోడపత్రికలను రాష్ట్ర మాజీ గవర్నర్లు నరసింహన్, తమిళ సై సౌందర్య రాజన్, లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు షియాన్, డాక్టర్ పట్టిహిల్,ఫాబ్రిషియో వొలివేర, లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్లు బాబురావు,సునీల్ కుమార్ చేతుల మీదుగా 92 గోడపత్రికలను విడుదల చేయడం జరిగిందన్నారు.