హుస్నాబాద్ పట్టణంలోనీ ప్రసిద్ధ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ – షమిత గార్లు మరియు వొడితల ఇంద్రణీల్ గారు
ప్రముఖ పుణ్యక్షేత్రం గా ఫరిడవిల్లుతున్న హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కి సుమారు లక్షా యాభై వేల రూపాయలతో చేసిన వెండి హారాన్ని సమర్పించి మొక్కు ను చెల్లించుకున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు.
ఈరోజు హుస్నాబాద్ పట్టణం లోని ప్రముఖ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్- షమిత దంపతులు దర్శించి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి సతీష్ కుమార్ దంపతులు గతంలో మొక్కుకున్న మాట ప్రకారం వెండి హారాన్ని అమ్మవారికి సమర్పించారు, అలాగే పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఆ అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మేలు జరగాలని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని వేడుకొన్నారు.
అనంతరం వారిని దేవస్థాన కమిటీ ఛైర్మెన్ మరియు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ స్థానిక మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..