రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 30:- మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ ఎలక్ట్రికల్ అధ్యాపకులకు సబ్జెక్టు నైపుణ్యత పై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని రామాయంపేట,మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఎలక్ట్రికల్ విభాగం అధ్యాపకులుగా పనిచేస్తున్న లెక్చరర్లు హైదరాబాదులోని సన్నత్ నగర్ లో గల రేడియంట్ ఇన్స్టాప్ టెక్నాలజీలో ఐదు రోజుల పాటు శిక్షణ పొందనున్నారు.ఈ సందర్భంగా వారికి ఎలక్ట్రికల్ కు సంబంధించిన అధునాతన పరికరాలపై అవగాహన కల్పించారు.రేడియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోఆర్డినేటర్ ప్రదీప్,సబ్జెక్టు ఎక్స్పర్ట్ దినేష్ ఆధ్వర్యంలో అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు.పలు అంశాలపై వారు అవగాహన కల్పించుకుంటున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన తో పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించారు. సమాజంలో పెరిగిపోతున్న అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా విద్యాబోధన ప్రాక్టికల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని వారు అధ్యాపకులకు తెలియజేశారు.