జిల్లాలో క్రీడలకు ప్రత్యేక సంస్కృతిని అభివృద్ధి చేయాలి.అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు.
సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి ఎంతో తోడ్పడునందిస్తాయి.
టీఎన్జీవోస్ టీజీవోస్ ట్రేసా ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులకు జిల్లాలో ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి.
హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహణ
వివిధ క్రీడలలో పాల్గొని ప్రతిభ చూపించి బహుమతులు గెలుచుకున్న ఉద్యోగులకు అభినందనలు.
జిల్లాలో క్రీడలకు ప్రత్యేక సంస్కృతిని అభివృద్ధి చేయాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు తెలిపారు.
గురువారం స్థానిక మెదక్ స్టేడియం నందు జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులకు చేపట్టిన వివిధ క్రీడా పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతుల ప్రధాన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొని బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానచంద్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు.
క్రీడలు విద్యార్థులకు శారీరక మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు సహకరిస్తాయని అలాగే క్రీడలు రోజువారీ జీవితంలో భాగంగా ఉండాలన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువత హాకీ వంటి క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలన్నారు.
టీఎన్జీవోస్ టీజీవోస్ ట్రేసా ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులకు జిల్లాలో ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహించే విధంగా చర్యలు సమన్వయంగా వ్యవహరించాలని చెప్పారు.
ఒలింపిక్స్ లో 4 సార్లు స్వర్ణ పతకాలు గెలిచిన ధ్యాన్ చంద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలన్నారు. అంతేకాకుండా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ప్రొఫెషనల్ ప్లేయర్స్ గా ఎదిగి ఒలింపిక్స్ కు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వై.దామోదర్ రెడ్డి టీఎన్జీవోస్ ప్రెసిడెంట్ నరేందర్ జిల్లా రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షులు మహేందర్ గౌడ్ సంబంధిత వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు