జిల్లాలో వానాకాలం 2024-25 ధాన్యం కొనుగోలు కోసం ముందస్తు ప్రణాళిక కోసం ధాన్యం కొనుగోలు కమిటీ తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
సిల్వర్ రాజేష్ స్టూడియో 10టివి ప్రతినిథి మెదక్ జిల్లా.
గురువారం మెదక్ ఐ.డి.ఓ.సి కార్యాలయంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ చాంబర్లో జిల్లాలో వానాకాలం 2024- 25 దాన్యం కొనుగోలు కోసం ముందస్తు ప్రణాళికలు ధాన్యం కొనుగోలు కమిటీతో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటిష్ట ప్రణాళిక నడుమ జిల్లాలో వానాకాలం 2024-25 కొనుగోలు ప్రక్రియను జరిపేందుకు కొనుగోలు కమిటీతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో 1,01,966 హెక్టార్లలో వరి ధాన్యం సాగు అయ్యిందని ఈ వానాకాలం సీజన్లో 6,11,795 టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఇందులో 2,67,203 టన్నుల సన్న ధాన్యం మరియు 3,44,592 టన్నుల దొడ్డు ధాన్యం వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా అంచనా వేశామని చెప్పారు.
ఇందులో రైతుల సొంత అవసరాలు విత్తనాల కోసం మరియు ఇతర ట్రేడర్ల కొనుగోలు పోను దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంటుందని దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.
వచ్చే సీజన్ కి ఒక కోటి గోనె సంచులు అవసరం అవుతాయని ఇప్పటికీ 50 లక్షల గోనె సంచులు అందుభాటులో ఉన్నాయని జిల్లా మేనేజర్ సివిల్ సప్లయిస్ కమిటీ దృస్టికి తీసుకొచినట్లు వివరించారు మరియు మిగితా గోనె సంచుల కోసం ఇండెంట్ పెడతామని తెలిపారు.
జిల్లాలో 400 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అందుకు అవసరం అగు కొనుగోలు కేంద్రాల సామాగ్రిని సమకూర్చాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ఆదేశించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్ష సమవేశం లో జిల్లా గ్రామీణా భివృద్ది అధికారి శ్రీనివాస రావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ జిల్లా సహకార అధికారి కరుణా జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్ రెడ్డి జిల్లా మేనేజర్ పౌర సరఫరాలు హరికృష్ణ మరియు మార్కెటింగ్ అధికారి నాగరాజు పాల్గొన్నారు.