కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం వార్డులో ఉండే విధంగా చేపట్టిన ఓటరు మెర్జింగ్ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు తెలిపారు
సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పార్థసారథి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణలో భాగంగా ఓటరు మెర్జింగ్ ఓటరు జాభితా రూపకల్పన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఓటరు జాబితా తయారులో అబ్యంతరాలు పిర్యాదులు తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో 20 మండలాల పరిధిలో 493 గ్రామ పంచాయతిల పరిధిలో 4232 వార్డులున్నట్లు తెలిపారు.వచ్చే నెల 6వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాల్సి ఉన్నదని అందువల్ల గ్రామ పంచాయతీ వార్డులు వారిగా కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా ఓటరు జాభితా మెర్జింగ్ జరుగుతున్నట్లు తెలిపారు.టి.ఈ.పోల్ సాఫ్ట్ వేర్ నందు ఓటరు జాభితా మెర్జింగ్ జరుగుతున్నదని జిల్లాలో ఇప్పటి వరకు 50 శాతం వరకు ఓటరు జాభితా మెర్జింగ్ పూర్తి చేశామని మిగిలిన 50 శాతం రానున్న రెండు రోజుల్లోపూర్తి చేస్తామని అన్నారు.సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితానుప్రచురించనున్నామని ఈ జాబితాపై సెప్టెంబర్ 7నుంచి 13వతేదీవరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. 9వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో జిల్లాలో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. సెప్టెంబర్ 21 వ తేదీన వార్డుల వారీగా తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య డిపిఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.