సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
తేది -28-08-2024.
డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి.
-సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి
కౌడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్.
ఈరోజు ఆకస్మికంగా కౌడిపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు వారు ఏఏ విధులు నిర్వహిస్తున్నారో కౌడిపల్లి ఎస్సై రంజిత్ కుమార్ జిల్లా ఎస్పీకి వివరించినారు.ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ కి ఎస్.ఐ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలసి మొక్కలు నాటినారు.పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్ పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు.ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని బ్లూకోల్ట్స్ పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని సూచించారు.ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. సిబ్బంది అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరిగిపోయాయి వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అలాగే రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎవరైనా గొడవలు సృష్టించాలని సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలను ప్రచారం చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏదైనా సమస్యాత్మక ప్రాంతం ఉంటే దానిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు తెలియజేశారు.ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా కృషి చేయాలని తెలియజేశారు.అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో గల వివిధ సమస్యల గురించి మరియు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సిబ్బందికి వివరించడం జరిగింది.అనంతరం సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి.వెంకటరెడ్డి నరసాపూర్ సిఐ.జాన్ రెడ్డి ఎస్సై.రంజిత్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.