ఈ నెల 07.08.2024 నాడు మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదం లో మరణించిన కానిస్టేబుల్ దుర్గపతి pc no 1886 కుటుంబానికి అండగా ఉండటానికి జిల్లాలోని తోటి సిబ్బంది అంతా కలసి 80,000/- రూపాయలను వారి కుటుంబ సబ్యులకు జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మరియు జిల్లా అదనపు ఎస్.పిఅడ్మిన్ ఎస్.మహేందర్ చేతుల మీదుగా అందియడంజరిగినది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.మాట్లాడుతూ పోలీస్ శాఖ కుటుంబంలోని ఒకరిని కోల్పోయామని వారికి అన్నీ వెళలా అండగా ఉంటామనిం అన్నారు.అలాగే దుర్గాపతికి శాఖపరంగా రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ లు దరించాలని కోరారు.దుర్గాపతి ఉన్నతాదికారుల మన్ననలు పొంది ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడని అతడి సేవలను ఈ సందర్భంగా కొనియాడినారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.