సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
తేది 27-8-2024.
రాబోయే గణేష్ ఉత్సవాల సమన్వయ సమావేశం
హాజరైన పలువురు గ్రామ పెద్దలు నాయకులు తదితరులు
ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని కులాల మత పెద్దలతో మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు.పోలీస్ శాఖకు సహాయంగా ఉండి గణేష్ పండుగను ఆనందంగా నిమర్జనం చేయాలని మండపాల నిర్వాహకులకు సూచనలు.సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే భద్రత అవసరమైన చోట్ల ప్రత్యేక పికెట్ ఏర్పాటు
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులు నమ్మవద్దని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ మీటింగ్ మెదక్ డి.ఎస్.పి.ప్రసన్న కుమార్ మరియు మెదక్ పట్టణ సీఐ.నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.విచ్చేసినారు.ఈ సందర్బంగా జిల్లా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.మాట్లాడుతూ. గణేష్ ఉత్సవాలకు సంబంధించి పలు సూచనలు చేయడమైనది. మెదక్ జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా అని గణేష్ ఉత్సవాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులు నమ్మవద్దని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వినాయక మండపాల నిర్వాహకులకు మండపాల నిర్వహణకు పర్మిషన్లు కచ్చితంగా తీసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖ కు సహాయంగా ఉండి గణేష్ పండుగను ఆనందంగా నిమర్జనం చేయాలని మండపాల నిర్వాహకులకు తెలిపారు.గణేష్ మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.మండపాల వద్ద అసంగీక కార్యకలాపాలు జరిపితే కఠిన చర్యలు 9 రోజులు మండపాల వద్దకు రాత్రి పోలీస్ పెట్రోలింగ్ ఈ సంవత్సరం వినాయక చవితి నవ రాత్రులు తేదీ:07-09-2024 నుండి విగ్రహాల స్థాపనతో ప్రారంభమై తేదీ:17-09-2024 న శోభాయాత్ర ఊరేగింపుతో ముగుస్తుంది. ఇట్టి శోభయాత్ర జరుపుకోను సమయంలో ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని కులాల మత పెద్దలతో షాద నగర్ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినామాని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పండుగలలో గణేష్ పండుగ ఒకటని గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదని ఈ విషయంలో అధికారులు సిబ్బంది కలిసి పనిచేయాలన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా భద్రతా చర్యలు చేపడుతున్నామని గణేశ విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్లు ముందుగా నిర్వాహకులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించాలని తెలిపారు.
ఆయా ప్రాంతాల్లోని ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని నిర్వహణ భద్రతకు సంబంధించి మున్సిపల్ అగ్నిమాపక నీటి పారుదల శాఖ వైద్య విద్యుత్ రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.నిమజ్జనానికి వచ్చే భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజిబుల్ పోలీసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని గణేష్ మండపంలో రోజంతా కనీసం ఇద్దరు వాలంటీర్లు ఉండేలా నిర్వాహకులు చూడాలని మండపాల్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా నాణ్యమైన వైర్లను మాత్రమే వాడాలని ఎస్పి సూచించారు.గణేష్ మండపాల నిర్వాహకుల వివరాలు ఫోన్ నంబర్లు కమిటీ వివరాలు మండపాల ఇన్‌ఛార్జ్ ఫోన్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని విద్యుత్ ప్రమాదాలు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని గణేష్ మండపం నిర్వహణ కమిటీ వివరాలను సేకరించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వినాయక మండపాల దగ్గర ఘర్షణలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే భద్రత పెంచాలని అవసరమైన చోట్ల ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేస్తామన్నారు.గణేష్ ఉత్సవాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులు నమ్మవద్దని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్,బీజేపీ పంజా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.