ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా

తేది 27- 8-2024.

స్థానిక మెదక్ పట్టణంలోని పిల్లి కొట్యాల్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం అధికారులతో పరిశీలించారు.
డిపార్ట్మెంటల్ తరగతి గదులు ల్యాబులు ప్రయోగశాలలు వివిధ రకాల వసతి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో అన్ని రకాల వసతులతో పాటు విద్యార్థులు నేర్చుకోవడానికి అనువైన అన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సూపరిండెంట్ డా.శివదయాల్, ప్రిన్సిపల్ రవీందర్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!