మంత్రాలయం మండల నూతన అధికారులు పరిచయం చేపించిన జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ

జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘం రాష్ట్ర పర్యటన భాగంలోనూ మంత్రాలయం మండల నూతన అధికారులు పరిచయం చేపించిన జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ *
STUDIEO 10TV
ADONI DIVISION

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ నందు నేడు జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పర్యటన భాగంగా మంత్రాలయం మండలానికి విచ్చేసిన జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మండల నూతన అధికారులు ఎమ్మార్వో ఎంపీడీవో హౌసింగ్ డి ఈ, ఎన్ఆర్జిఎస్ ,ఐకెపి వారులను పరిచయం చేపించి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రాలయం మండలంలోని దాదాపు గ్రామపంచాయతీలు 21 ఉండగా ఆ గ్రామాల్లోన మాదిగ కులాలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ మండలంలో దళిత,గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సంఘాలు, నాయకులు అధికారులు వివక్షత చూపించకుండా నేరుగా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా చేయాలి. అదేవిధంగా ఈ నెల 01 వ తేదీన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షనీయం.దీనికి వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడం మాల సోదరులకు సబబు కాదు, భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341,342 , 16(4) రాజ్యాంగ జనాభా ధమాషా ప్రకారం ఎక్కువ జనాభా ఉంటే వర్గీకరణ ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగినది.రాబోయే రోజుల్లో జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘం సంపన్న వర్గాల వారసత్వానికి రిజర్వేషన్ తీసివేసి, నిరుపేద దళిత గిరిజనులకు రిజర్వేషన్ వర్తించే దిశగా క్రిమిలేయర్ అమలు చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేస్తామని మాట్లాడి, మంత్రాలయం నియోజకవర్గంలో స్థానిక రాజీకీయ నాయకులు దళిత గిరిజనులను ప్రభుత్వ కార్యక్రమాల్లో, సమావేశాల్లో నాయకులు మాత్రమే కుర్చీల మీద కూర్చొని దళిత గిరిజనులు కింద కూర్చోబెట్టి వివక్షత చూపిస్తున్నారు. ఈ విధంగానే పరిణామాలు చోటు చేసుకుంటే మాదిగలు ఓట్లు మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి. ఆ ఓట్లతో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించి, దళిత గిరిజనులు సంక్షేమ పథకాలు, భూములు విషయంలో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాస్ట్లు సీసీ రోడ్ల,డ్రైనేజులు, తాగునీరు, ఇంటింటి కొళాయిలు నిర్లక్ష్యం కాకుండా వేగవంతం పని చేయాలని మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ, జై భీమ్ ఎమ్మార్పీ జిల్లా కార్యదర్శి రత్నం మాదిగ, జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గం నాయకులు దేవరపాటి అనిల్ కుమార్, నాగేంద్ర,జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం టౌన్ అధ్యక్షుడు గోపాల మాదిగ,జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం మండల అధ్యక్షులు గాడిమోడు నరసింహులు మాదిగ, జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం మండల కార్యదర్శి గర్జీ ప్రకాష్ మాదిగ, జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం మండల నాయకులు చెట్నపల్లి అజయ్ మరియు జై భీమ్ ఎమ్మార్పీఎస్ వివిధ గ్రామ ప్రజలందరు, తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!