స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 26, మహానంది:
గ్రామాల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని నంద్యాల రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మహానంది మండలంలోని గోపవరం, సీతారామపురం, మసీదుపురం గ్రామాలలను మహానంది ఎస్ఐ ఎన్ .రామ్మోహన్ రెడ్డితో కలిసి, సందర్శించి, గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ…గ్రామాల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలనీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే పోలీసుల దృష్టికి తెచ్చి, సమస్య పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎటువంటి,తెలియని లింకు లను క్లిక్ చేయవద్దని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుంటే ఏదైనా వాహన ప్రమాదాలు జరిగినప్పుడు, తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పిల్లల నడవడికను, ప్రవర్తనను ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో మహానంది ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.