ఇప్పుడొచ్చింది బెయిలే – అంత మెడిసిపాటేందుకు
బీజేపీ- బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్..
షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగమణి
కవితకు బెయిల్ ఊహించిందే అని, వంద కోట్ల లిక్కర్ కుంభకోణంలో ఐదు నెలలు గడిపిన కవిత విడుదలతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగమాగం అయితున్నారని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగమణి విమర్శించారు. మంగళవారం ఆమె మీడియాకు ప్రకటనలను విడుదల చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని తెలిపారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి బీజెపీకి బీఆర్ఎస్ దాసోహం అయ్యిందన్నారు. హరిష్, కేటీఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.. బీజేపీ, బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయన్నారు. బీజేపీ లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందన్నారు. ఇంకా బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని తెలిపారు. కడిగిన ముత్యం అని సంబోధిస్తున్న బీఆర్ఎస్ నాయకులు అప్పుడే ఈ కేసులో తీర్పు వచ్చినంత హడావిడి చేస్తున్నారని నాగమణి ఎద్దేవా చేశారు..