24 గంటల్లో 17 ఆపరేషన్లు..

వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో శనివారం గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 17 వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహించి రికార్డు సృష్టించారు.

ఇందులో 6 డెలివరీలు,ఒక గర్భసంచి లో గడ్డ,3 సాధారణ శస్త్ర చికిత్స లు,2 కంటి ఆపరేషన్లు, 5 ఆర్తో ఆపరేషన్లు ఉన్నాయి. ఈ సందర్భంగా డి సి హెచ్ ఏస్ సూపరిండెంట్ సీనియర్ సర్జన్ డా. పెంచలయ్య మాట్లాడుతూ.. వంద పడకల ఆస్పత్రిలో ప్రస్తుతం అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నట్టు తెలిపారు. యం ఎల్ ఏ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సహకారంతో మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. సామాన్య ప్రజలు వినియోగించు కోవాలని కోరారు. ఈ ఆపరేషన్ లో సూపెరిండెంట్ గైనకాలజిస్ట్ డా.సంధ్య,డా.రత్నమాల,ఆర్థో డా.అనిల్ , మత్తు వైద్య నిపుణులు డా.రాజశ్రీ,డా.తిరుపతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!