రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 24:- మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామం ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు కృష్ణుని వేషధారణలో విద్యార్థినిలు గోపికల వేషధారణలో వచ్చి నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు.కృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు కృష్ణాష్టమి గురించి విద్యార్థులకు తెలియజేశారు.దేవకి వాసుదేవుడు దంపతులకు అష్టమసంతానముగా జైలులో జన్మించాడని విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలియజేశారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీష్ కుమార్, ఉపాధ్యాయులు మోహన్ ,మమత, నవీన్, రత్నాకర్, జ్యోతిలక్ష్మి పాల్గొన్నారు.