సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
శుక్రవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో ఆర్ ఓ ఆర్ ముసాయిదా చట్టం 2024 అమలుపై వివిధ వర్గాల ప్రజల నుండి సలహాలు సూచనలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన చర్చా వేదికలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డినరసాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి మెదక్ ఆర్డీవో రమాదేవి తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ . రైతుల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం అందరితో సమాలోచన చేసి చట్టం తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ చర్చా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన హక్కుల రికార్డు బిల్లు 2024 రూపకల్పన సందర్భంగా న్యాయవాదులు రైతులు రైతు సంఘాలు రైతులు పదవీ విరమణ చేసిన అధికారులు సిబ్బంది మేధావులు ఇలా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయ సేకరణకు చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
నూతన చట్టం తేవడం ద్వారా రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.ప్రభుత్వం చట్టం రూపకల్పనలో క్షేత్రస్థాయిలో ప్రజల సూచనలు సలహలను తీసుకోవాలని
ఈ నూతన ముసాయిదా చట్ట రూపకల్పనలో భాగంగా అభిప్రాయ సేకరణలో ఇచ్చిన సలహాలు సూచనలు ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆర్ ఓ ఆర్ చట్ట రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం అభ్యంతరాలు సలహాలు సూచనలు కొరకు ప్రభుత్వం వెబ్ సైట్ కూడా అందుబాటులోకి తెచ్చిందని వెబ్సైట్లో కూడా మీయొక్క సలహాలు సూచనలు ప అందజేయాలని ఆయన సూచించారు.రైతులకు స్వేచ్ఛగా సక్రమంగా హక్కులను కల్పించే చర్యల్లో ఇలాంటి చర్చా వేదికలు ఎంతగానోఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి గోవింద్ అన్ని మండలాల తాసిల్దారులు న్యాయవాదులు రిటైర్డ్ ఉద్యోగులు రైతు సంఘాల నాయకులు రైతులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.