కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు ఒక వరం.

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా

  • మెదక్ పట్టణంలో 38 మంది, మెదక్ మండలం 40 మందికి అందజేత
  • మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
  • కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మెదక్ పట్టణంతో పాటు మెదక్ మండలంకు సంబంధించి 78 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని ఆయన అన్నారు. నియోజక వర్గంలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరూరు శంకర్ శ్రీనివాస్ చౌదరి మాజీ సర్పంచ్ చింతల వెంకట్,పాతూరు సిద్దయ్య తో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చైర్మెన్ చంద్రపాల్ మెదక్ ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు ఆర్.ఐ లక్ష్మణ్ స్టాఫ్ ఎల్లం జ్యోతి అరుణ తదితరులు పాల్గొన్నారు.
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!