ఆదోని మండలంలోని నాగలాపురం దగ్గర ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ను శనివారం కర్నూలు జిల్లా ఎంపీ పంచలింగాల నాగరాజు సందర్శించారు. డి.ఎస్.పి సోమన్న, ఎమ్మార్వో శివ రాముడు, వైద్య సిబ్బంది సూపర్డెంట్ డా. శ్రీరాములు, ఆర్ఎంవో డా. జగదీష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా కూటమి ప్రభుత్వం తరపున ఆదోని నియోజకవర్గంలో సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చామన్నారు. అందులో భాగంగానే ఈరోజు గోనెగండ్ల దగ్గర ఉన్న గాజులదిన్నె ప్రాజెక్టు, ఎమ్మిగనూరులో బనవాసి నవోదయ స్కూల్, ఆదోని మెడికల్ కళాశాల సందర్శించడం జరిగింది అన్నారు. మెడికల్ కళాశాల ను సందర్శిస్తూ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలకు మేము ముందుంటామని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి ఆదోని ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ చాగి మల్లికార్జున రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, సర్పంచు దొడ్డనకేరి శివప్ప, మాజీ సర్పంచ్ ఆనవాళ్లు మహబూబ్ బాషా, మాజీ కౌన్సిలర్ వెంకన్నపేట మల్లికార్జున, ఆరెకల్ మాజీ సర్పంచ్ ఎల్ఐసి రామకృష్ణ, దిబ్బనకల్ సర్పంచ్ లక్ష్మన్న, విరుపాక్షి రెడ్డి, మధిర రంగస్వామి,ధనాపురం రాఘవేంద్ర, పెట్టకండి వీరారెడ్డి యాదవ్, శుక్రవారం పేట శివ,జాలమంచి నాగరాజు, షబ్బీర్, దాదు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు అప్సర భాష అప్సర భాష, శేఖర్, సాంబగళ్ళు రమేష్, రంగన్న, మహానంద్ రెడ్డి,లక్ష్మన్న, రాము పరమేష్ ,భాష, శేఖర్, సాంబగళ్ళు రమేష్, రంగన్న, మహానంద్ రెడ్డి లక్ష్మన్న, రాము పరమేష్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.