STUDIEO 10TV
ADONI DIVISION
………….CPM. డిమాండ్.
కౌతాళం మండలంలో ఈ సంవత్సరం ముందుగా వర్షాలు రావడం వల్ల రైతులు పత్తి, మిరప, వేరుశనగ, ఉల్లిగడ్డలు, కొర్రలు మొదలైన పంటలు వేసినారు. మండలంలో వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మండలంలో మంచి వర్షాలు రావడం వల్ల రైతుల ఎరువుల కోసం ప్రైవేట్ అంగళ్లు చుట్టు తిరుగుతున్నారు .అంగడి యజమానులు రైతులును అవసరాలు చేసుకొని అధిక ధరలకు ఎరువులను అమ్ముతున్నారు.. ప్రభుత్వము రైతులను దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా కేంద్రం నకు, సహకార సంఘాలకు (సొసైటీలు) ఎరువులు సప్లై చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య డిమాండ్ చేసినారు.
గతంలో సొసైటీలకు ,రైతు భరోసా కేంద్రమునకు ఎరువులు రావడం వల్ల రైతులు స్థానికంగా ఎరువులు తీసుకుని పొలాలకు వేయడం వల్ల లగేజీలు ,ప్రయాణ ఖర్చులు, అధిక రేట్లు రైతులకు తగ్గేవి. కనుక వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి రైతులు నష్టపోకుండా ప్రవేట్ ఎరువుల వ్యాపారస్తుల నుంచి రక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఎరువులు నుంచి రైతులను ఆదుకొనకపోతే రైతు సంఘంగా రైతులందరిని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించినారు.