సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
బుధవారం మెదక్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని ఎంపిక చేయబడిన 20 మంది విషయ నిపుణులకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రంలపై జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాధికారితో కలిసి గ్రౌండ్ బేస్డ్ లర్నింగ్ కార్యక్రమం పై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను అర్థవంతంగా నిజజీవితంలో ఉపయోగించుకునే విధంగా తయారు చేయాలని ఆ దిశగా కంటెంట్ రూపొందించాలని వివిధ పాఠశాలల నుండి ఎంపిక చేసిన విషయ నిపుణులకు సలహాలు సూచనలు ఇచ్చారు.
ఆరు నుండి పదవ తరగతి వరకు తరగతిల వారీగా పైన తెలిపిన సబ్జెక్టుల వారిగా తయారు చేయాలని తదుపరి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో అమలు చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శన మూర్తి జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి మరియు వివిధ పాఠశాల నుండి వచ్చిన విషయ నిపుణులు పాల్గొన్నారు.