రామాయంపేట ( స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 13:- మెదక్ జిల్లా నుండి జాతీయ ఫుట్బాల్ జూనియర్ జట్టుకు రామాయంపేట ఉమ్మడి మండలం క్రీడాకారుడు అంకిత్ నాయక్ 11 ఆగస్టు జరిగిన జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ లో తెలంగాణ జట్టులో స్థానం సంపాదించాడు. ఆగస్టు 11న జరిగిన ఫైనల్ జాతీయ ఫుట్బాల్ జూనియర్ బాలుర జట్టు మణిపూర్ రాష్ట్రాన్ని ఓడించి నాలుగు మూడు స్కోర్ తో విజయం సాధించింది.1993 తర్వాత మళ్లీ అప్పుడు హైదరాబాద్ ఫుట్బాల్ జట్టుగా తెలంగాణ తరఫు ఆడిన సందర్భంగా జరిగిన పోటీలలో గెలవడం జరిగింది. మళ్లీ ఇప్పుడు నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు ఫుట్బాల్ కు స్వర్ణ యుగంగా విజయాన్ని అందించారు.రామాయంపేట ఉమ్మడి మండలంకు జడ్చర్ల తండా చెందిన అంకిత్ నాయక్ అనేక క్లబ్ల తరఫున గజ్వేల్ నుండి ఆడడం జరిగింది. జులై నెలలో రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో పాల్గొని తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గత జాతీయ ఫుట్బాల్ సబ్ జూనియర్ లో రామాయంపేట పట్టణానికి చెందిన యువజ్యోతి అకాడమీ నుంచి కూడా బుల్లెట్ శరత్ చంద్ర అనంతపూర్ లో జరిగిన సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఉమ్మడి మండలం మరియు రామాయంపేట పట్టణం నుండి ఇద్దరు క్రీడాకారులు జాతీయస్థాయి ఆడడం పట్ల క్రీడాభిమానులు మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్సె క్రెటరీ నాగరాజు మెదక్ కోచ్ ప్రశాంత్ , వినయ్ , వంశీ రామచంద్రనాయక్ ,రామా యంపేట యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ మరియు మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ అభినందనలు తెలిపారు.