రామాయంపేట ( స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 13:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామాన్ని నూతనంగా గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల తహసిల్దార్ రజనీకుమారి కి గ్రామస్థులు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోల్పర్తి గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం వల్ల ఎలాంటి నిధులు కూడా కేటాయించకపోవడం వల్లన ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక పోతుందని గ్రామస్తులు తెలిపారు.తాము మున్సిపాలిటీ పరిధిలో ఇంటి టాక్స్ లు అధికంగా ఉండి కట్టలేకపోతున్నామని పేర్కొన్నారు.ఇంటి పన్నులు కట్టడం వలన నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.అదేవిధంగా మున్సిపాలిటీలో మార్కెట్ భూముల విలువ పెరిగి తాము రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేక పోతున్నామని వాపోయారు.అలాగే గ్రామంలో ఉపాధి పని కోల్పోతున్నామని దాని ద్వారా తాము వలస ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేసుకొని బతకవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు.ఇప్పటికైనా 950 నుండి 1000 జనాభా గల మా గ్రామాన్ని జిల్లా కలెక్టర్,ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే మాకు నూతనంగా గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు.లేనియెడల రిలే నిరాహార దీక్షలు చేపడుతామని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.