రామాయంపేట ( స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 13:- మెదక్ జిల్లా రామాయంపేట,నిజాంపేట తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సమాజ సేవకు తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందని రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ బూర మల్లేశం అన్నారు.మంగళవారం నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి విచ్చేసిన ఆయనను పద్మశాలి సంఘం అధ్యక్షుడు కట్ట ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సంఘ భవనంలో శాలువాతో సన్మానించారు. అనంతరం బూర మల్లేశం మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పద్మశాలీలకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన మార్పు రావడంలేదని ఏ ప్రభుత్వం కూడా తమ పద్మశాలీలకు సంక్షేమ పథకాలు అందివ్వడం లేదన్నారు. రాష్ట్రంలోని పద్మశాలిలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే లక్ష్యంగా తాను పనిచేస్తానన్నారు.ప్రస్తుత ప్రభుత్వంతో కొట్లాడి మన హక్కులను మనం సాధించుకుందాం అన్నారు. త్వరలోనే రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయని తాను కూడా రాష్ట్ర అధ్యక్షునిగా పోటీలో ఉన్నానని తనకు సహకరించి ఎన్నికల్లో పద్మశాలి అంతా ఓటు వేసి గెలిపిస్తే పద్మశాలి సేవలో తాను కొనసాగుతా అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కట్ట ప్రభాకర్ రామాయంపేట మండల అధ్యక్షుడు మద్దెల రమేష్ బల్ల సుధాకర్ యాదగిరి మోహన్ భూమేష్ అంబటి లక్ష్మీపతి దేవస్థానం లక్ష్మణ్ కట్ట తిరుమల్ తిరుపతి నర్సింలు బాలకిషన్ బాలనందం రామచంద్రం తదితరున్నారు.