ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం నంద్యాల ఒంగోలు హైవే రోడ్డులోని బాలాజీ నగర్ మొదటి లైన్ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు బురద మయంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఈ రోడ్డుపై నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇక స్కూలుకి వెళ్లే విద్యార్థులు ఈ రోడ్డుపై నడిచి వెళుతున్న సమయంలో క్రింద పడిపోతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు పట్టించుకోని రోడ్డు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.