పత్రిక ప్రకటన : తేదీ : 03.08.2024
చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు
సిద్దిపేట జిల్లా : ఆగస్టు03,(హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం / కోహెడ మండలం) చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వారు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ మహాధర్నా నిర్వహింస్తున్నట్లు తెలియజేశారు. త్వరలో జరుగబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాలని , పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి, బిసిలకు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 50% శాతం రిజర్వేషన్ లు కల్పించాలని, బీసీ బడ్జెట్ 2లక్ష్మ కోట్లకు పెంచాలని, కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బీసీ క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6,7వ, తేదీల్లో భారీ ఎత్తున నిరసన చేపట్టినున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలోని అన్ని జిల్లాల నుంచి ఐదు వేల మందికి పైగా భారీ ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. ప్రతి ఓక్కరూ హాజరై బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి పై పోరటానికి సిద్ధం కావాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నాంపల్లిసమ్మయ్య,పిట్టల రమేష్,చొప్పరి శ్రీనివాస్ ముదిరాజ్ ,తదితరులు పాల్గొన్నారు.