చేవెళ్ల
అక్రమ అరెస్టులకు హద్దు లేదు ఏలే వాడికి బుద్ధి లేదు
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
ఇది ప్రజా పాలన కాదు
ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కే రామస్వామి
జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ
మున్సిపల్ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల న్యాయమైన హక్కుల సాధనకై ఇందిరా పార్కు దగ్గర ఈరోజు తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి వెళుతున్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే రామస్వామి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ కౌన్సిల్ సభ్యురాలు వడ్ల మంజుల జిల్లా మండల పార్టీ కార్యదర్శి ఏం సత్తిరెడ్డి సహాయ కార్యదర్శి ఎం డి మక్బూల్ గీత పనివాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ తదితరులను అక్రమంగా రెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే రామస్వామి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఉద్యమాలను అక్రమ అరెస్టులతో ఏ విధంగా అడ్డుకున్నారో ఈరోజు తెలంగాణలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదిప్రజా పాలన ప్రభుత్వం అని చెప్పుకొని అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేస్తుంది రాష్ట్రంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసుకోవచ్చని ఇది ప్రజా పాలన అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టి ఒకపక్క ధర్నా చేసుకోవచ్చని ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చి ఇంకొకపక్క పోలీసులతో అక్రమ అరెస్టులను చేయడం హేయమైనా చర్యా అని గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఏమి పెద్దగా తేడా లేదని అన్నారు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు శివ ప్రధాన కార్యదర్శి డప్పు శివయ్య బాబురావు యాదగిరి ఆనందం లలిత రమాదేవి పెంటయ్య తదితరులు ఉన్నారు