ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నూతన విద్యా బోధన పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్త హ్ అనే కార్యక్రమం శుభభోజన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తరకొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గూడూరు ఎలక్షన్ బాబు పాల్గొన్నారు, ఈ క్రమంలో గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడైతే ఎక్కువ మంది ఉండి ఉపాధ్యాయ సిబ్బంది ఎక్కడైతే తక్కువ ఉన్నారో అలాంటి పాఠశాలలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో ఉపాధ్యాయ సిబ్బందిని నియమించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపిస్తున్నారు, విద్యార్థిని విద్యార్థులకు మాన్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో నిర్వహిస్తున్న శిక్షసప్తహ్ ముఖ్య ఉద్దేశం విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించటం, నాణ్యమైన విద్యానిచటం తల్లిదండ్రులను ఇందులో భాగస్వామ్యంలో చేయటం, విద్యార్థినీ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఈనెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు అనగా వారం రోజులపాటు నిర్వహించడం జరిగిందన్నారు,ఈ కార్యక్రమానికి “శుభ బోజన్” కార్యక్రమానికి జనసేన మండల కన్వీనర్ కేతి మురళి భోజన సదుపాయం కల్పించారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్త హ్ కార్యక్రమానికిప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి మస్తాన్ నాయక్, మండల జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏరువా మల్లికార్జున రెడ్డి, షేక్ మహబూబ్ బాషా, తంగిరాల చెన్నారెడ్డి, కేతి మురళి, యమ దాసయ్య, పండు, షేక్ మంజూర్, అంబటి వీరారెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు,