క్రమ సంఘం మియాపూర్ వారి ఆధ్వర్యంలో
రంగారెడ్డి జిల్లా స్టూడియో 10 కే. బి రాజు
మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎంక్లేవ్ లోని ప్రగతి కళా మండపంలో కమ్మ సంఘం మియాపూర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో సుమారు 346 మందికి పైగా పాల్గొ ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి ఈసీజీ , బీపి,షుగర్, 2 డి ఎకో పరీక్షలు నిర్వహించి ఆర్థోపెటిక్ గైనకాలజీ , కార్డియాలజీ , చిన్నపిల్లలు వివిధ రకాల వైద్యులు వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్మ సంఘం మియాపూర్ వారు మెడికవర్ ఆసుపత్రి ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు 30 శాతం కన్సిషన్ సదుపాయం కమ్మ సంఘం మియాపూర్ వారి ద్వారా రోగులకు కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కమ్మ సేవా సమితి అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ కమ్మ సంఘం మియాపూర్ వారు వివిధ సేవా కార్యక్రమాలు చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు ఆర్య విషయంలో అశ్రద్ధ వహించకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్, భాష
మియాపూర్ కమ్మ సంఘం అధ్యక్షులు డి ఎస్ ఆర్ కె ప్రసాద్, మియాపూర్ కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీ లీలా ప్రసాద్, వల్లభనేని సత్యనారాయణ, పిహెచ్ చౌదరి, రాజేంద్రప్రసాద్, మూర్తి, తారక్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.