ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మొద్దు నాగేశ్వరరావు, పాఠశాల సిబ్బంది, ఆధ్వర్యంలో అంతర్జాతీయ నూతన విద్యా బోధన పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్త హ్ అనే కార్యక్రమం మరియుశుభభోజన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పెద్ద దోర్నాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డిని ఎడవల్లి పాఠశాల హెడ్మాస్టర్ మరియు సిబ్బంది శాలువాతో ఘన సన్మానం చేశారు, అనంతరం విద్యార్థినీ విద్యార్థులు పూల వర్షం కురిపిస్తూ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డినిఘనంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఎరువ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇలాంటి పథకాలను సద్వినియోగం చేసుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు,