గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి.
రంగారెడ్డి జిల్లా స్టూడియో 10. స్టాఫ్ రిపోర్టర్ కే బి రాజు.
తెలంగాణలో ప్రత్యేకంగా నిర్వహించే ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బస్తీలు,కాలనీలలోని ఆలయాలలో ముఖ్య అతిధులుగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన బోనాల పండుగలో శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి,నేతాజీ నగర్ ,నల్లగండ్ల, టీఎన్జీవోస్ కాలనీ,జీపీఆర్ఏ క్వార్టర్స్ ఖాజాగూడ,రాయదుర్గం,బీహెచ్ఈఎల్ లలో బోనాల పండుగ సందర్భంగా వివిధ బస్తీలు, కాలనీ లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు.ఆషాడ,శ్రావణ మాసాలలో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని తెలిపారు.మన సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీకగా పేర్కొన్నారు.అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతి ఆడబిడ్డ హిందూ సంస్కృతికి నిజమైన వారసురాలు.అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ రాష్ట్ర, జిల్లా,సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు , మహిళ నాయకులు,మహిళ కార్యకర్తలు అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోషషన్ సభులు, ఆయా దేవాలయ కమిటీ సభ్యులు,భక్తులు,అభిమానిల ,కాలనీ వాసులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.