- అమ్మవారి చల్లని దీవెనలు గ్రామస్తుల అందరిపై ఉండాలి
- రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి
చేవెళ్ళ:
పోచమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో గ్రామ దేవత పోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో గ్రామ పెద్దలు, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సాంప్రదాయ దుస్తులతో బోనం ఎత్తుకొని, కోడిపుంజును చేతితో పట్టుకుని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మ తల్లి దీవెనలతో వర్షాలు బాగా కురవాలని గ్రామంలోని ప్రజలందరూ పాడి పంటలతో,సుఖ సంతోషాలను ఉండాలని పోచమ్మ తల్లి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సామ రంగారెడ్డి, మాణిక్ రెడ్డి, జంగయ్య గౌడ్, బేగరి అరుణ్ కుమార్, చంద్రయ్య, హరి, రాజు, చీర శీను, చందు, గ్రామస్తులు పాల్గొన్నారు.