రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి…
రంగారెడ్డి జిల్లా : ఆషాడ బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతికలుగా నిలుస్తున్నాయని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాశస్త్యం కల్పించిందని చెప్పారు. అన్ని ఆలయాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయ సహకారాలు ప్రతి ఒక గుడి కి దక్కుతుందన్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా నాచారంలోని శ్రీ మహంకాళి దేవాలయం అమ్మవారికి టీ టీ యు సి రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు హైదరాబాద్ ప్రజలతోపాటు తెలంగాణవ్యాప్తంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ తల్లి ఆశీస్సులతో ప్రజలకు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సమకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు రామ దేవి, ఇనస్పెక్టర్ ప్రణీత్ ,టెంపుల్ కమిటీ సభ్యులు చైర్మన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.