- అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సున్నపు ప్రవీణ్
- అంబేద్కర్ సంఘం పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు.
చేవెళ్ల ,జులై 28
గ్రామ దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సున్నపు ప్రవీణ్ ఆకాంక్షించారు. చేవెళ్ల గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీలో సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా పోచమ్మ తల్లి కి బోనాలు సమర్పించారు. ఇంటికి ఒక్క బోనం చొప్పున మహిళలు తీసుకవచ్చి కాలనీవాసులు ఒక్క చోట కలిసి బోనాలను ఊరేగింపుగా అమ్మవారి గుడి వద్దకు తీసుకవచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ…అమ్మ వారు గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ గ్రామంలో ఎలాంటి రోగాలు రాకుండా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలుపండాలని, పశు పక్షాదులు, పిల్లా పాపలు సల్లంగా ఉండాలని, గ్రామంలో ఎలాంటి రోగాలు రాకుండా చూడాలని వేడుకున్నామని అన్నారు. ఈ ఉత్సవంలో పోతురాజు విన్యాసాలు, యువకుల స్టెప్పులు, ఆడపడుచుల సాంప్రదాయ దుస్తులు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బోనాల ఉత్సవ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.