ఈ ఒలంపిక్స్ పథకం చారిత్రాత్మకం.
శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి,తెలంగాణ ముఖ్యమంత్రి.
రంగారెడ్డి జిల్లా బ్యూరో:ఈ ఒలంపిక్స్ పథకం చారిత్రాత్మకమని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..పారిస్ ఒలింపిక్స్ 2024లో మన దేశం తరపున తొలి మెడల్ సాధించిన షూటర్ మను బాకర్ కు ప్రశంసలు కురిపించారు..ఈ సందర్బంగా ప్రధానమంత్రి మోడీజీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,,ఒలంపిక్స్ పథకం చారిత్రాత్మకమన్నారు,అనంతరం అభినందనలు తెలిపారు.మను విజయం అందరినీ గర్వపడేలా చేసిందని ఒక సందేశంలో సీఎం పేర్కొన్నారు.ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 221.7 స్కోరుతో మను బాకర్ కాంస్య పతకం సాధించారు…