డయల్‌ 100 కాల్స్‌ పై ప్రత్యేక నిఘా..

తేది 27.07.2024.
సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి.

ఆపదలో ఆపన్న హస్తం అందించే దే ‘డయల్ 100’ వ్యవస్థ

శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్‌ సిబ్బంది ముందుండి డయల్‌ 100 కాల్స్‌ పై తక్షణమే స్పందించాలి.


డయల్ 100 సర్వీసును సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు భద్రత మరియు సత్వర సహాయం అందించవచ్చు.


ఇది అత్యవసర సమయంలో వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.


డయల్‌ 100 కాల్స్‌ పై ప్రత్యేక నిఘా.. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి : జిల్లా ఎస్.పి.డి.శ్రీ.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్


ఈ రోజు జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ…. జిల్లా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న బ్లూ కోట్స్ మరియు పెట్రో కార్ సిబ్బందితో డయల్ 100 కాల్స్ పై సమీక్షా సమావేశం నిర్వహించి వారికి డయల్ 100 కాల్స్ విదులను గురించి సిబ్బందికి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ….
పోలీసులు సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి తీరు జనం మెచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో పోలీసు విభాగం కొన్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది. అందులో ‘100’ నెంబర్తో కంట్రోల్ రూమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘100’ విధానానికి మరింత సాంకేతిక పరిజ్ఞానం, పాదర్శకత, జవాబుదారీతనం జోడిస్తూ ‘డయల్-100’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని ప్రతి ఫోన్ కాల్ను రికార్డు చేసే ఇక్కడి సిబ్బంది ఆ సమస్య పరిష్కారమయ్యాకే దాన్ని క్లోజ్ చేస్తారు. ఈ విధానంపై అనునిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంది.
శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్‌ సిబ్బంది ముందుండి డయల్‌ 100 కాల్స్‌ పై తక్షణమే స్పందించాలని సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్‌ సిబ్బంది తక్షణమే స్పందించి బాధితలకు న్యాయం చేయాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల ధన, మాన, ప్రాణ, రక్షణను కాపాడాల్సిన బాధ్యత పోలీస్‌ వ్యవస్థపై ఉందన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే బ్లూ కోట్స్‌ సిబ్బంది ఆపద సమయంలో ముందుండాలన్నారు. సమాజంలో వేగంగా పెరుగుతున్న జనాభాలో సాంకేతికంగా మార్పులు చెందుతున్నాయని ఈ తరహాలో నేరాలు బాగా పెరుగుతున్నాయన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీస్‌ వ్యవస్థలో కూడా మార్పులు రావాలని కోరారు. డయల్‌ 100 కాల్స్‌ వచ్చినప్పుడు బ్లూ కోట్స్‌ సిబ్బంది అత్యవసర పరిస్థితిలో ఉన్నా సంబంధిత ప్రదేశాలకు వెళ్లి బాధితులకు సహాయం చేయాలన్నారు. సమస్య పెద్దదిగా ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు Dail 100 service చాలా పటిష్టంగా మరియు ప్రతిష్టాత్మకంగా ప్రజలు వినియోగించుకుంటున్నారని ప్రజలకు ఎటువంటి విపత్కర పరిస్థితిలో అయిన పోలీసు వారి సహాయం కావలసినపుడు ప్రజలు 100 కి కాల్ చేసి పిర్యాదు చేయవచ్చని వెనువెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది వెళ్ళి అట్టి వారిని విచారించి వారి ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారని జిల్లాలో దీని కోసం ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఈ 100 కాల్స్ నీ మానిటరింగ్ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లోని ఎస్.హెచ్.ఓ ఆ పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి కాల్స్ లను క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఫోన్ చేసి అక్కడికి వెనువెంటనే బ్లూ కొల్ట్ లేదా పెట్రోల్ కార్ టీమ్ ను పంపించి వారి యొక్క ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేయడం జరుగుతుంది.
కానీ కొంతమంది రాత్రి పూట మత్తు పానీయాలు సేవించి డయల్ 100 కాల్ చేయడం జరుగుతుంది. అట్టి వారిని పోలీస్ స్టేషన్ కి ఉదయం పూట పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్ని పోలీసు స్టేషన్ SHO లకు సూచించారు. ఇట్లా కొంతమంది చేయటం వలన Dail 100 సర్వీస్ ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆపదలో ఉన్న వారికి సరియైన సేవలు అందవని అలాంటి వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎస్పి SHO లకి సూచించారు. అలాగే ఆకతాయిలు, తాగుబోతులు అనవసరంగా ‘డయల్ 100’ కాల్స్ చేస్తే అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని అన్నారు. 100 డైల్ కాల్ నీ అత్యవసర పరిస్థితిలో మరియు విపత్కర పరిస్థితి లో పోలీసు వారి సహాయం కావాలనుకునేటప్పుడు తప్పని సరిగా వినియోగించుకోవాలన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!