ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమం…
స్టూడియో 10 రంగారెడ్డి: జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కే బి రాజు.
కొండాపూర్ డివిజన్ పరిధిలో గల మాదాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని. విద్యార్థులకు శనివారం ప్రకృతి పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యావరణ ప్రేమికుడు ఎం.బసవలింగం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎర్త్, ఓషియన్.అట్మాస్ఫియర్ సైన్సెస్ ఆచార్యులు.ఆచార్య జి.కిషోర్ కుమార్ ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రోజురోజుకు జనాభా విపరీతంగా పెరుగుతున్నదని . దీనితో జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయన్నారు. మానవ కార్యకలాపాలు పెరగడంతో సహజ వనరులు రోజురోజుకు తగ్గిపోవడంతో పాటు వృథా చేయడం కూడా జరుగుతుందన్నారు.దీనివలన పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతున్నదని పేర్కొన్నారు.
భూమిపై జీవులు బ్రతకాలంటే సహజ వనరులైన గాలి, నేల, నీరు, మొక్కలు, ఖనిజాలు, సహజ వాయువులు సమస్థితిలో ఉండాలని.జనాభా పెరుగుదల, అవగాహన లేమి, నిర్లక్షo వలన సహజ వనరులు తగ్గిపోవడంతో ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిని అనేక అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. అందుకే ప్రతి సంవత్సరం జులై 28న ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఒక నినాదంతో జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సంవత్సరం నినాదం ప్రకృతికి అనుగుణంగా స్థిరంగా జీవించడం భవిష్యత్తు తరాల శ్రేయస్సు కోసం సహజ వనరులను పొదుపుగా వాడుకుంటూ దుర్వినియోగం చేయకుండా ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సమాజానికి అందించే దిశలో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవ ముఖ్యఉద్దేషమని అన్నారు.
ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షిత: అన్నారు కదా. మనం నిర్లక్ష్యము వహిస్తే ప్రకృతి మనపైన కూడా నిర్లక్ష్యము వహిస్తుంది. వాయువుతోనే ఆయువు ఆరంభం. వాయువుతోనే ఆయువు అంతం. నడుమన నడిచేదే నరుని జీవితం అంటారు. కానీ ఆ వాయువుని కలుషితం చేస్తున్నాము. విచక్షణా రహితంగా అడవులను నరికి వేస్తున్నాము. బుడిబుడి అడుగులతో మొదలై ఎన్నో అడుగులు వేసినా భూమిలో ఆరడుగులే శాశ్వతం. మరి దేనికోసం ఆరాటం. సహజ ఖనిజాలను కొల్లగొట్టడం, అభివృద్ధి పేరిట కర్మాగారాలను పెంచేస్తూ పరిసరాలను కాలుష్యంతో నింపుతున్నాము. దీనివలన పీల్చే గాలి నుండి తినే ఆహారం వరకు ప్రతిది కలుషితం అయిపోయి రోగాల బారిన పడుతున్నాము. కాలుష్యం వలన గ్లోబల్ వార్మింగ్ ఎక్కువై భూగ్రహం అతిగా వేడెక్కడం వలన వన్యప్రాణులు చనిపోతున్నాయి. మానవుని కార్యకలాపాల వలన ఓజోన్ పొరకు నష్టము వాటిల్లింది. దీనితో మన వినాశనాన్ని మనమే కొనితెచ్చుకుంటున్నామని అన్నారు.
నీటిని పూజించే సంస్కృతి మనదని. దాహం తీర్చే నీటిని కలుషితం చేయడంతో పాటు వృథా చేస్తున్నాము. నదుల నుండి ఇసుక తరలిస్తున్నాము. నదీ తీరాలు ఆక్రమణకు గురై నదీ ప్రవాహాలు దారి మార్చుకోవడంతో ముంపుకు, వరదలకు కారణమవుతున్నాయని ఉషదీకరించారు.మానవుని పకృతి విరుద్ధమైన పనుల వలన సహజ వనరులను అమితంగా కోల్పోతున్నాము. పెట్రోల్, విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాలి. కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, వాగులు, వంకలు, అడవులు, ఇసుక తిన్నెలు ఇవన్ని కూడా సహజ వనరులే. వీటిని రక్షించటం మన అందరి బాధ్యత. ఖనిజాలను వెలికి తీయడానికి అడవులను నరికేస్తారు. రహదారులు. భవనాల నిర్మాణాల కోసం ఎన్నో చెట్లను అడ్డదిడ్డంగా నరికేస్తున్నారు. చెరువులు, కాలవులను ఆక్రమించి చదును చేసి భవనాలను నిర్మిస్తున్నారు. కొండలను పిండి చేసి కంకర కుప్పలుగా మారుస్తున్నారు. ఇక ప్రకృతి సమతుల్యత ఎక్కడుందన్నారు. ఇప్పటికైనా మేల్కొని సహజ వనరులను, పర్యావరణాన్ని రక్షించుకోవడం అత్యావస్యకం. దీనికి నాలుగు ‘ఆర్ ‘ లు అనే సూత్రాలను పాటించాలని కోరారు.
రెడ్యూస్. రేస్ 3. రిసైకిల్ పున:చక్రియం రికవరీ అనే వాటిని మన జీవన విధానంలో భాగంగా బాధ్యతను స్వీకరించి పర్యావరణ వినాశనాన్ని కొంతవరకు నియంత్రించ వచ్చన్నారు. రోజురోజుకు వాతావరణ కాలుష్యం అధికమవుతుందని.దీంతో గాలి నాణ్యత తగ్గిపోతున్నది.వాయు కాలుష్యం కారణంగా హైదరాబాదు నగర పరిసరాలలో ప్రతి సంవత్సరం వందల మంది వరకు మరణిస్తున్నట్టు అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ వాయు కాలుష్యం వలన తీవ్రమైన దగ్గు, జలుబు, ఆస్తమా కారణంగా ఊపిరి తిత్తులపై ప్రభావం పడి తద్వారా శ్వాసలో లోపం ఏర్పడి మరణానికి దారి తీస్తుందన్నారు. ఫీ. యం. 2.5 అధికంగా నమోదు అవుతుంది. కావున జీవ వైవిధ్యం పెంచడానికి విరివిగా చెట్లు పెంచడం, ప్లాస్టిక్ ను నిషేధించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందిని తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బసవలింగం ప్రకృతి పరిరక్షణకై తమవంతు బాధ్యతగా కృషి చేస్తామని అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వరరావు మాజీ డిప్యూటీ రిజిస్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, వెంకట ధర్మ సాగర్ తదితరులు పాల్గొన్నారు