పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోండి


-స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వండి

ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు

రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి బీసీ క‌మిష‌న్ సైతం నిర్దిష్ట గ‌డువులోగా నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని చెప్పారు.

ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందాల్సి ఉందని అధికారులు వివరించగా, జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

రాష్ట్రంలో పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ, అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాంబరం కృష్ణమోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ ఏ.సుదర్శన్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!