సంస్థ మీద ఆధారపడి జీవిస్తున్న 20 వేల మంది కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని !  సిఐటియు,  జిల్లా నాయకుల డిమాండ్.!!

ఏపీఎండిసిలో బెరైటీస్ డిస్పాచ్ అమ్మకాలు, ప్రారంభించి, సంస్థ మీద ఆధారపడి జీవిస్తున్న 20 వేల మంది కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని !  సిఐటియు,  జిల్లా నాయకుల డిమాండ్.!!

  ఏ పీ ఎం డి సి సంస్థ లో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, గత రెండు నెలలుగా,  నూతన ప్రభుత్వం ఏపీఎండిసి సంస్థ మంగంపేట బ్రాంచ్ నందు బెరైటీస్ డిస్పాచ్ అమ్మకాలు పూర్తిగా నిలిపివేశారని, దీనితో సంస్థ మీద  ప్రత్యక్షం గాను, పరోక్షంగాను ఆధారపడి జీవిస్తున్న సుమారు  20 వేల మంది కార్మిక కుటుంబాలు , ఉపాధి లేక తినడానికి తిండి లేక ఆకలి కేకలతో అలమటిస్తున్నారని, అన్నమయ్య జిల్లా,  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు, సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏ రామంజులు, జిల్లా కోశాధికారి,  హరి శర్మ, శనివారం కోడూరు సిఐటియు ఆఫీసులో విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఆరోపించారు. 


ఇసుక, బెరైటీస్, సర్వే స్టోన్స్, బొగ్గు గనుల్లో, అవినీతి  జరిగిందని ,ప్రభుత్వానికి తెలుసు, ఈ అవినీతి  పైన విచారణ జరపాల్సిందే, అవినీతి పరులు ఎంతటి వారినైనా శిక్షించాల్సిందేనని అలాగే వారి ఆస్తులను జప్తు చేసి సంస్థకు ఇవ్వాలని అన్నారు.  అయితే అవినీతి అని   సొట్ట పెట్టి సుమారు రెండు నెలలుగా బెరైటీస్  అమ్మకాలు , డిస్పాచ్ మరియు కొనుగోలు ,నిలిపివేయడంతో,చిన్న, చిన్న , లారీలు ,టిప్పర్లు, మిషన్లు,  ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, ఓనర్లు, రెండు నెలల నుండి జీతాలు లేక పస్తులు ఉన్నారని, తెలిపారు.

మిల్లు కార్మికులు,లోడింగ్, అన్లోడింగ్ కార్మికులు, మరియు బెరైటీస్ బ్రేకింగ్ చేసే వేల మంది కూలీలు పనులు లేక, జీవనోపాధి కోల్పోయారు అలాగే విదేశాలకు ఎక్స్పోర్ట్ నిలిపివేయడంతో, పారిశ్రామిక వేత్తలు వారి వ్యాపారాలు దెబ్బతింటాయని, ఇక్కడ బేరైటీస్ ఇవ్వకుంటే ఇతర దేశాల్లో ఉన్న  సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారని, గతంలో ఏపీఎండీసీ ఎండి  గా వచ్చిన శాలిని  మిశ్రా గారు చేసిన  తప్పిదం వలన, ఏ పిఎం డి సి సంస్థ కొట్లాది రూపాయలు నష్టం వచ్చి బేరైటీస్ రేటు పూర్తిగా పడిపోయి సంస్థ ఆర్థికంగా పెద్ద దెబ్బ తిందని, వారు గుర్తు చేశారు.

ప్రస్తుతం అదే తప్పు ఇప్పుడు చేస్తున్నారని దీనివలన సంస్థకు నష్టం జరిగే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  సంస్థ నందు డిస్పాచ్ రవాణా నిలిపివేస్తే సంస్థ ఉద్యోగస్తులకు, కార్మికులకి, జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదన్నారు. తక్షణం డిస్పాచ్ ప్రారంభించి 20 వేల కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లేకుంటే ఇబ్బంది పడుతున్న కార్మికులను వారి కుటుంబాలను కలుపుకుని ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!