సిల్వర్ రాజేష్ (స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా)
తేది 26-7-2024.
ఈ రోజు ఉదయం భారతీయ జనతా పార్టీ రామయంపేట మండలం మరియు పట్టణ కార్యవర్గ సమావేశం ఎర్రం విట్టల్ భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజాంపేట్ జెడ్పిటిసి బిజెపి మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ పంజ.విజయ్ కుమార్
రామాయంపేట పట్టణ ప్రజా సమస్యలపై రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. వెనుకబడిన రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి మున్సిపాలిటీని అభివృద్ధి పరచాలి,గతంలో రామాయంపేట నియోజకవర్గంగా ఉండి పునర్విభజనలో నియోజకవర్గాన్ని కోల్పోయిన రామాయంపేట ను తిరిగి నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేయాలి.విద్య వైద్యంపై ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పట్టణ కేంద్రం గా ఉన్నటువంటి క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలి మినీ స్టేడియం పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని త్వరితగతంగా అమలు చేయాలి. ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి బస్టాండ్ లో అన్ని జిల్లాల డిపోలో బస్సులు ఆగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రహదారుల విస్తరణ బటర్ఫ్లై లైట్స్, ఐ మాస్ లెట్స్, అండర్ డ్రైనేజీల పనులు చేపట్టాలి. పైసమస్యల గురించి ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యల పరిష్కారం , హామీల అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరపున పంజా విజయ్ కుమార్ సమావేశంలో మాట్లాడడం జరిగింది. కార్యకర్తలకు అండగా ఉంటామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు నాయకులందరూ కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.