సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి మాజీ జడ్పీటీసీ,డా.అజయ్
ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల వలన సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం ఒక మీడియా ప్రకటనలో వాంకిడి మండలం మాజీ జడ్పిటిసీ,డా.అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద నీటిలో ఎక్కువగా వర్షంలో తడిస్తే జలుబు దగ్గు గొంతు నొప్పి ప్లూ జ్వరం బారిన పడతారని ఇదే సీజనల్ జ్వరాలకు దారితీస్తాయి వర్షాలు ఎక్కువగా కురుస్తున్న తరుణంలో ఇంటి ఆవరణంలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని మీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఈగలు ఏర్పడి అవి కుట్టడం ఆహార పదార్థాల మీద వాడడం వలన టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలు వస్తాయి వర్షాకాలం సమయలలో మీరు ఎక్కువగా కలు షితం అవుతాయి తాగునీరు కాచి చల్లార్చి తీసుకొవాలి మాస్క్ ధరిస్తే కోవిడ్ తో పాటు సీజనల్ జ్వరాలు రాకుండా రక్షణ పొందవచ్చు విద్యుత్ తీగలు పోల్స్ ని అనాలోచితముగా తాక కూడదు పై లక్షణాలు ఏమాత్రం కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న హాస్పటల్ సంప్రదించగలరని ప్రజలకు సూచించారు.గ్రామాలలో ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకి అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.