ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్


తేది 22-7-2024.
సిల్వర్ రాజేష్ (స్టూడియో 10టీవీప్రతినిధి మెదక్)

ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.ఆదేశానుసారం జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్ గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్ఐ మరియు సిఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా , మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.తెలియజేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారు. అలాగే జిల్లాలో అనుమాస్పదన వ్యక్తులు కనబడినా,సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని దృష్టికి వచ్చిన,గంజాయి విక్రయం జరుగుతున్నా లేదా రవాణా చేస్తున్న, వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 కి ఫోన్ చేయవచ్చు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. జిల్లా ప్రజల సమస్యల నివారించడానికి మరియు వారి సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని ఎస్పీ గారు ఈ సందర్భంగా తెలియజేశారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!