ముగ్గురు ఉపాధ్యాయులు..143 మంది విద్యార్థులు
యర్రగొండపాలెం : మండల లోని గంజివారిపల్లె గ్రామం లో ఉన్న జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివుతున్న విద్యార్థులు 143 మంది ఉన్నారు .. పదో తరగతిలో 19 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.వీరందరికీ పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులు మాత్రం లేరు .. కేవలం తెలుగు,హిందీ, గణితం ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మిగతా సబ్జెక్టులు ఎస్,ఎన్ఎస్,సోషల్,బయాలజీ, పి డిలకి ఉపాధ్యాయులు లేరు. దీంతో అన్ని సబ్జెక్టులు ముగ్గురు టీచర్లే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటుగా అక్కడ విద్యార్థిని, విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం లేదు. వాడుక నీరు లేకపోవటంతో విద్యార్థులు, విద్యార్థినిలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూసి చదువుకునే సౌకర్యాన్ని పిల్లల కి కల్పించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.