ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక గ్రంధాలయంలో సోమవారం గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్ మరియు సాహితీవేత్త గొట్టి ముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో తెలుగు ప్రముఖ కవి దాశరథి కృష్ణామాచార్యులు 99వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భరతమాత ముద్దుబిడ్డ , ప్రముఖ తెలుగుసాహితీవేత్త , విద్వత్కవి , నైజాంరాజు దుశ్చర్యలను త్రిప్పికొట్టి అగ్నిధారలు విరజిమ్మిన అసలుసిసలైన తెలంగాణ పోరాటయోధుడు , మానవతావాది , సమతావాది , సినీగేయరచయిత , ఎవడైనా మానవుడే – ఎందుకు ద్వేషించడాలు, రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయంలేదు, అని సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాక్షించి, గతాన్ని కాదనలేను వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదలుకోను కాలం నా కంఠమాల నాపేరు ప్రజాకోటి – నా ఊరు ప్రజావాటి అని నొక్కివక్కాణించి, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని సగర్వంగా గర్జించిన కవిసింహము, అభ్యుదయ కవితాచక్రవర్తి , శాంతివిప్లవవాది కళాప్రపూర్ణ బిరుదులను పొంది పద్య దాశరథిగా చిరకీర్తిగడించిన మాన్యశ్రీ డా.దాశరథి కృష్ణమాచార్యులుగారి సాహిత్య సేవలను కొనియాడారు.