ఘనంగా జరిగిన మొహరం పండుగ వేడుకలు
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల గ్రామంలో పీర్ల చావిడి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మొహరం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. గత కొన్ని రోజులుగా మొహరం వేడుకలను వివిధ రూపాలలో ప్రత్యేక పూజలను వనర్చారు. ప్రత్యేక పూజలు, అనంతరం అగ్ని గుండం ద్వారా తమ భక్తిని చాటుకొని, తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. పురవీధులలో ఊరేగించి కార్యక్రమాలను ముగించారు. ప్రతి సంవత్సరము వచ్చే ఈ మొహరం పండుగను హిందూ, ముస్లింలు ఆనవాయితీగా జరుపుకుంటారు. ఈ పండగలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి, మొహరం పండుగ ద్వారా దైవాన్ని సందర్శించు కొన్నారు. . పీర్ల చావిడి కమిటీ సభ్యులు మాట్లాడుతూ వీరుల త్యాగాలకు చిహ్నమని, ప్రేమ, త్యాగం, శాంతి సందేశాన్ని తెలిపేదే ఈ మొహరం పండుగ అని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ మానవాళికి ఈ మొహరం పండుగ స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. త్యాగ గుణాన్ని గౌరవించేందుకు వీరత్వం నుంచి స్ఫూర్తి పొందేందుకు, మొహరం పండుగను జరుపుకుంటామని తెలిపారు. మానవాళిలో ఐక్యతను నింపేందుకే ఈ పండుగ ఎంతో కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు. పీర్లను వైనం భక్తాదులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, చక్కెరతో చదివింపులు చేసి, వాటిని భక్తాదులు కూడా పంపిణీ చేశారు. డప్పు, వాయిద్యాల నడుమ ఈ పండుగ కన్నులు పండుగగా తిలకించారు. హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంతో చేసే పండుగ నేడు పొందడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.