రంగారెడ్డి జిల్లా వార్తలు.. స్టాఫ్ రిపోర్టర్ కే బి రాజు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి…….
అక్రమ నిర్మాణం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించవద్దని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి ఆదేశించారు . సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వీటిపై పర్యవేక్షణ చర్యలకు గాను సర్కిల్ కు ఒకటి చొప్పున బృందాన్ని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.పట్టణ ప్రణాళిక విభాగం పారిశుధ్యం సహా వర్షాకాలం నేపథ్యంలో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో మధ్యాహ్నం ఆయా శాఖల అధికారులతో జడ్జి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ అనుమంతులకు భిన్నంగా నిర్మించే అక్రమ నిర్మాణాలను నేల కూల్చాలని ఆదేశించారు .సర్కిల్ కు నియమించే బృందాలు ఎప్పటికప్పుడు వీటిపై తగు పర్యవేక్షణ చేపట్టాలని నిబంధనలను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.కోర్టు కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు పత్రాలను సమర్పించాలని వేగవంతంగా చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వహణ పనులను మరింత పటిష్టంగా చేపట్టాలని ఎప్పటికప్పుడు చెత్త ..ఇతర వ్యర్ధాలను తొలగించాలని ఆదేశించారు. మాల్స్ సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులను వసూలు చేసే విషయంపై అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని …వాటిలో విక్రయించే తిను బండారాలను నాణ్యతను పరిశీలించాలని జడ్సి ఉపేందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయడం ద్వారా అత్యుత్తమ స్థానంలో నిలబెట్టాలని సూచించారు…..