12 ఏళ్ల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులు
చేవెళ్ల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2011-12 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 12 సంవత్సరాల తరువాత ఆదివారం జీపీఆర్ ఫామ్ హౌస్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఇన్నేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆనాడు చేసిన తీపి, మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. పూర్వ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి ఉపాధ్యాయులు నాగరాణి, రాజు, యాదయ్య, యాదిలాల్, యాదగిరి, సత్యం, మల్లేష్, మంజుల, రమేశ్ శాలువతో సన్మానించి మెమోంటోను అందజేశారు. పిల్లలను బాగా చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలను పూర్వ విద్యార్థులకు సూచించారు. పదో తరగతి పూర్తయి 12 సంవత్సరాలు గడించిందని, చఫువుకున్న రోజుల్లో చేసిన మధురస్మృతులు, తీపి సంఘటనలు గుర్తు చేసుకొని చాలా ఆనందపడ్డామని, ఈ అపూర్వ కలయిక తమకు ఎంతో నందనిచ్చిందని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ అపూర్వ కలయిక మరపురానిదని, ఇప్పట్నుంచి మనం రంగాల్లో ఉన్న ప్రతి రోజు ఫోన్, వాట్సాప్ గ్రూప్ లో మాట్లాడుకుందమని, మనలో ఎవరికి ఏ సమస్య వచ్చిన అందరం ఒక్కటై పరిష్కరించుకోవాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉన్నారు.